Friday, March 14, 2025
spot_img
Homeలోకల్ వార్తలుఅద్భుత ఘట్టంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించిన బ్రైటెన్ స్కూల్ యాజమాన్యం.

అద్భుత ఘట్టంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించిన బ్రైటెన్ స్కూల్ యాజమాన్యం.

మిస్సెయిల్ మాన్ అఫ్ ఎవరు తల్లి అని అడిగిన ప్రత్యేక అతిధి- డాక్టర్ మంచు కుమార స్వామి.

విజయనగరం సిటీ (ఫిబ్రవరి 28) న్యూస్ వన్ ప్రతినిధి :
కంటోన్మెంట్ /వుడా కాలనీ -పాల్ నగర్ లో గల బ్రైటెన్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో నోబెల్ గ్రహీత సర్ సి. వి. రామన్ గొప్ప పరిశోధన ఆవిష్కరణ అయిన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్బంగా ప్రతియేడు జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకుంటున్న విషయం అందరికి తెలిసినదే, అందుకు గాను విజయనగరం పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్న సూర్య’స్ బ్రైటెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు 1.150 ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల ఫోటోలు 2.ఉదయం టూత్ బ్రష్ నుండి నైట్ మాస్కితో కోయిల్ వరకు 3.పెన్సిల్ నుండి రాకెట్ వరకు 4.ప్యాంటు జిప్ నుండి సబ్ మెరైన్ వరకు 5.ఈ మెయిల్ నుండి వాట్సాప్ వరకు 6.టాయిలెట్ పేపర్ నుండి అంతరిక్షం లోని స్పేస్ పెన్ వరకు 7.పీచు మిఠాయి నుండి రసగుల్ల వరకు కనుగొన్న 150 దేశాల శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల యొక్క ప్రతిఫల వస్తువుల సమూహాన్ని ఒక దగ్గర అందరూ కలిసి తిలకించి విజ్ఞానాన్ని పెంచుకొనే విధంగా అట్టహాసంగా మరియు కన్నుల విందుగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

   మన శరీరంలో ముఖ్యమైన భాగం ఎవరైనా చెప్పండి -డాక్టర్ మంచు కుమార స్వామి.
      మన శరీరంలో ముఖ్య భాగం కళ్ళు అని ఓ విద్యార్థిని చెప్పగా చాలా బాగా చెప్పావ్ అని మెచ్చుకుంటూ  ఆకుకూరలు, కూరగాయలు ప్రత్యేకంగా క్యారెట్ వంటివి తినాలని చెప్పగా దానికి బదులిస్తూ  స్కూల్ డైరెక్టర్ కస్పా రేవతి ప్రతి సోమవారం పిల్లలకు ఆకు కూర పప్పు మరియు స్నాక్స్ కు క్యారెట్ పెట్టమని పేరెంట్స్ కు ప్రకటన ఇస్తాము అని చెప్పగా డాక్టర్ మంచు మెచ్చుకుంటూ అంతే కాకుండా టీవీ లకు, మొబైల్ కు పిల్లలను దూరంగా ఉంచాలని కరెస్పాండంట్ ఒమ్మి అవినాష్ కు సూచించారు అదే విదంగా పిల్లలలో ఎటువంటి కంటి సమస్యను గుర్తించిన వెంటనే పేరెంట్స్ కు తీయియచేయాలని ప్రిన్సిపాల్ నమ్మి శ్రీనివాస్ కు సలహా ఇచ్చారు.


  పిల్లలలోని నైపుణ్యాన్ని చూసి మురిసిన డాక్టర్ మంచు.
      విద్యార్థిని,విద్యార్థులు ఇంత చక్కగా తమలోని నైపుణ్యాన్ని ఆవిష్కరించినందుకు కుమార స్వామి పేరు పేరున అందరిని మెచ్చుకున్నారు అంతే కాకుండా ఇంత చక్కగా మహనీయుడు సర్ సి. వి. రామన్ కు గుర్తుగా జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించినందుకు స్కూల్ యాజమాన్యం అందరిని అభినదించారు 
            ఆసక్తిగా తిలకించి అభినందించిన వుడా కాలనీ వాసులు-ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన విషయం తెలుసుకొని పరిసర ప్రాంతంలోని విద్యార్థులు తల్లి తండ్రులు మరియు ఇతర ప్రజనీకం వచ్చి సైన్స్ ఫెయిర్ ను తిలకించిన తరువాత ప్రతి ఒక్కరూ స్కూల్ యాజమాన్యం వారిని అభినందించకుండా ఉండలేకపోయారంటే అతిషయోక్తి కాదనే చెప్పాలి 
         చివరగా ఈ కార్యక్రమం ను విజయవంతం చేయటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యoగా డాక్టర్ కుమార స్వామి గారికి యాజమాన్యం వారు కృతజ్ఞతలు తెలియచేసారు అదే విధంగా ఇంతటి చక్కటి కార్యక్రమం కు నన్ను ప్రత్యేక అతిధిగా పిలిచింనందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండంట్ ఒమ్మి అవినాష్, డైరెక్టర్ కస్పా రేవతి, ప్రిన్సిపాల్ నమ్మి శ్రీనివాస్ ఇతర స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఇతర వుడా కాలనీ ప్రాంతవాసులు పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments