
అభ్యుదయ రైతు సాగునీటి యాజమాన్యం కార్యవర్గ సభ్యులు ఖండాపు ప్రసాదరావు
పాలకొండ,న్యూస్ వన్ ప్రతినిధి :
2019`24 మధ్య జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అవన్నీ నిర్వీర్యంగా మారాయి. అంతేకాగా ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ కోసం, లస్కర్ల వ్యవస్థ లేకుండా పోయిందని, కనీసం గేట్లకు గ్రీజు పూసే పనులు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు పంటలను నష్టపోయారు. మీరు 21 వేల కోట్లతో సరిపెట్టుకొండంటే ఉత్తరాంధ్ర రైతుల పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పర్యాటనలో మన్యం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ప్రాజెక్టుల నిర్వహణలో సాగునీరందక రైతులు నష్టపోయారని తాను అధికారంలోకి వస్తే ప్రాజెక్టులకు ప్రాధాన్యతహిస్తామని తోటపల్లి ప్రాజెక్టు వద్ద బహిరంగ సభలో వాగ్దానం చేశారు. జగన్ చర నుంచి విముక్తి అయినామని, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు పూర్వ వైభవం కలుగుతుందని ఎంతో ఆశపడ్డాము. ఈ బడ్జట్‌లో జలవనరుల శాఖకు 21 వేల కోట్లతో సరిపెట్టకోమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవగారు చెప్పడం సమంజసం కాదు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయ ఉడు గారు 32,00 కోట్లు కేటాయించమని కోరారు. పెంచిన కేటాయింపులో తోటపల్లి ప్రాజెలకు పూర్తి స్థాయ ఇలో నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాగ్దానం నిలబెట్టుకోవాలని తోటపల్లి కాలువ రైతులు కోరుతున్నారు. ఇప్పటికే 25 శాతం లోపు పనులు చేపట్టడం వల్ల తోటపల్లి ఆధునీకరణ పనులు నిలిపివేశారు. రైతుల ఆశలను వమ్ముకావద్దని ప్రసాదరావు కోరుతున్నారు.