Friday, March 14, 2025
spot_img
Homeలోకల్ వార్తలుగుణశేఖర్ కు ఉత్తమ నటుడు అవార్డు అందజేసిన సుమన్

గుణశేఖర్ కు ఉత్తమ నటుడు అవార్డు అందజేసిన సుమన్

దామోదర్ గోవింద్ (స్టేట్ ఇంచార్జీ ,న్యూస్ వన్ )
శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖ ఏ. యు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో విశాఖ శివానందలహరి నేషనల్ లెవెల్ మ్యూజిక్ మరియు డాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వేడుకలో సీతొచ్చినయాల డేమో షార్ట్ ఫిలింకు ఉత్తమ నటుడుగా గుణశేఖర్ కు అవార్డు దక్కింది. ఈ అవార్డును నటుడు సుమన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నటుడు గుణశేఖర్ మాట్లాడుతూ శ్రీలంబోధర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తనకు ఉత్తమ నటుడుగా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి అవార్డులు నూతనంగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న వారందరికీ మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లంభోదర కల్చరల్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె ఎస్ అకాడమీ నాట్యాచారి పక్కి అరుణ్ సాయి కుమార్, కొరియోగ్రాఫర్ శశిధర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments