
రాజు(విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి)
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఈపీఎస్-95 పెన్షనర్లు 78 లక్షల 49వేల మంది ఉన్నారు వీరందరూ చెల్లించిన పెన్షన్ కార్పస్ ఫండ్ మొత్తం ఇపిఎఫో వద్ద 2024 మార్చి 31 నాటికి నిల్వ మొత్తం రూ 8,88.269 కోట్లు ఈ కార్పస్ పైన వచ్చే వడ్డీ మొత్తం రూ. 49.530 కోట్లు ఈపీఎస్ 95 పెన్షనర్లకు పెన్షన్ రూపంలో చెల్లించు చున్న మొత్తం రూ.15.130 కోట్లు మాత్రమే ఇస్తూ మిగిలిన రూ.44.400 కోట్లు మొత్తం మరల తిరిగి కార్పస్ ఫండ్ కు జమకబడుతుంది.కనీస పెన్షన్ పెంపుదల కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని నిధులు లేని కారణంగా పెంచలేక పోతున్నామని మోడీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నది. దీనిని తీవ్రంగా ఖండిస్తూ కనీస పెన్షన్ 9000/- డిఎతో కలిపి ఇవ్వాలని పెన్షన్ దారులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరించాలని,చలో ఢిల్లీ కార్యక్రమాలు జయప్రదం చేయాలని లేనియెడల ఆందోళన ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచరిస్తున్నామని సీఐటీయూ అధ్యక్షులు పి శంకర్రావు పేర్కొన్నారు ఈ ధర్నాలో ఇతర జిల్లా యూనియన్ నాయకులు పాల్గొన్నారు