సీఎంను కలిసి చెక్కు అందించిన రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్
అమరావతి :- అన్న క్యాంటీన్‌కు ది రిటైర్డ్ పవర్ ఇంజనీర్స్ అసోసియేష్ ప్రతినిధులు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిసి రూ.6,66,666ల చెక్కును అందించారు. పేదవాడు పస్తులుండకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి దాతృత్వం చాటుకున్న అసోసియేషన్ ప్రతినిధులను సీఎం అభినందించారు. చెక్కు అందించిన వారిలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ జి.పట్టాభిరామారావు, వై.కుమారస్వామి, సెక్రటరీ సాంబశివరావు, ట్రెజరర్ ఎస్ఎస్ఆర్ ఆంజనేయులు, సభ్యులు డీ.టీ నాయుడు, మల్లిఖార్జున రావు ఉన్నారు.