
–– టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
భీమిలిపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
రాష్ట్రంలో కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో ఆనందం, సంతోషమే ద్యేయంగా, సమన్యాయమే నాందిగా అడుగులు వేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు.భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రకటించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్దులే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అయిన రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంద్ర నుండి ముగ్గురు అభ్యర్థులకు అవకాశం కల్పించగా అందులో ఇద్దరు బీసీలు, ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉన్నారని అన్నారు. ఈ ముగ్గురిలో ఒకరు మహిళా అభ్యర్థి కావడం మరొక విశేషమని అన్నారు. కూటమి సర్కార్ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు అని అన్నారు. అదేవిదంగా మరొకసారి అవకాశం వచ్చేటప్పుడు మిగిలిన సామాజిక వర్గానికి న్యాయం చేసేవిదంగా మా మత్స్యకారులకు కూడా అవకాశం కల్పించే విధంగా ఆలోచన చేయాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు.**********************************