
విశాఖపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
నగరంలో పోలీస్ నని చెప్పి నమ్మించి పలువురిని మోసగించిన నకిలీ పోలీస్ ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.ఇతడు పలువురు పోలీస్ అధికారులతో ఫొటోస్ దిగి తాను పోలీస్ నేనని మాయమాటలు చెప్పసాగాడు.పోలీస్ డిపార్ట్మెంట్ లో పనులు చేయిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాధులు రావడంతో కమిషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి.ఈ క్రమంలోనే నకిలీ పోలీస్ ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ద్వారక ఏసిపి అన్నేపు నరసింహమూర్తి మాట్లాడుతూ పోలీస్ అని చెప్పి మోసాలకి పాల్పడుతున్న వ్యక్తిని ఎంవిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు.పోలీస్ సీజ్డ్ వాహనాలు ను ఇప్పిస్తనని ప్రజలను మోసం చేసినట్లు తెలిపారు. బాజీ జంక్షన్ లో ఉంటున్న లోచన్ కుమార్ అనే వ్యక్తి తో నేరాలకు పాలపడినట్లు , గతంలో గోపాలపట్నం, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో లొచన్ కుమార్ పై పలు కేసులు కూడా నమోదయ్యాయిని తెలిపారు.ఇటువంటి నేరగళ్ళుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.నిందుతుడు నుండి సుమారు 69 వేలు రికవరీ చేశామని తెలిపారు. అపరి చితుల వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎంవిపి పోలీస్ స్టేషన్ సిఐ జె.మురళి,ఎస్సై ధనుంజయ నాయుడు సిబ్బంది ఉన్నారు.