విజయనగరం(ఫిబ్రవరి 13)న్యూస్ వన్ ప్రతినిధి : -
ఆధార్ నమోదులోను, అప్డేషన్ లోనూ తప్పులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేసే ఆపరేటర్ల పై పెనాలిటి వేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఆధార్ నమోదు పై జిల్లా కమిటీ తో సమావేశం నిర్వహించారు.5 సంవత్సరాల లోపు పిల్లలకు, మహిళలకు, శాశ్వతంగా మంచాన పడి ఉన్నవారికి, ట్రాన్స్ జెండర్లను గుర్తించి ఆధార్ నమోదు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐ.సి.డి.ఎస్. జి.ఎస్.డబ్ల్యు. , పోస్టల్ శాఖల ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఆధార్ నమోదు కేంద్రాలన్నీ పని చేయాలన్నారు.
జిల్లాలో కొత్తగా జన్మించిన శిశువుల ఆధార్ ఎన్రోల్మెంట్, దీనికి సంబంధించి బర్త్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆధార్ ఎన్రోల్మెంట్ అనే విధానాన్ని అవలంబించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు మరియు డిపార్ట్మెంట్ వారు ఆధార్ ఎన్రోల్మెంట్ , జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఇంకా 49,489 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉందని అన్నారు. ఐదు సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్యలో జరగాల్సిన మొదటిసారి మానడేటరీ బయో మెట్రిక్ అప్డేట్, 16 నుండి 18 సంవత్సరాల మధ్యలో జరగాల్సిన రెండవసారి మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ వంటివి పూర్తిచేసి విద్యార్థులకు నీట్, జే ఈ ఈ ఇతర ఇతర పరీక్షలకు అడ్డంకులు లేకుండా చేయాలన్నారు. 17 సంవత్సరాలకు పైబడి మాండేటరీ బయోమెట్రిక్ పెండింగ్ 54985 ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు వారిచే నిర్వహించబడుతున్న 9 రకాల స్టేట్ హోల్డర్స్ ఆధార్ సెంటర్లలో ఉన్న ఆపరేటర్లను ప్రతినెల అవగాహన సదస్సులు నిర్వహించడం, తప్పుడు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆధార్ సర్వీసులు అందించిన వారిపై అపరాధ రుసుమును విధించడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తంగా 3240 ట్రాన్సాక్షన్ లకు గాను 34 లక్షల 36 వేల రూపాయలు అపరాధ రుసుము విధించడమైనదని, ఇది ఆధార్ సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయంలో 50 వరకు శాతంగా ఉంది అని తెలిపారు. జిల్లాలో ఉన్న వివిధ రకాల ఆధార కిట్లు అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉండేటట్లు చూసుకోవడం, జిల్లాలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆధార్ సెంటర్ లను జిల్లా యంత్రాంగం తనిఖీ చేసి సరిగా నిర్వహించని వాటిపై తగు చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్కూల్లలో మరియు కాలేజీల్లో ఆదర్శ స్పెషల్ క్యాంపులు నిర్వహించి మాండేటరీ బయోమెట్రిక్ లో ఉన్న పెండింగ్ పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశం లో డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, అదనపు ఎస్.పి సౌమ్య లతా, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ సత్యనారాయణ, జి.ఎస్.డబ్ల్యు జిల్లా కో ఆర్డినేటర్ రోజా రాణి, జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యం నాయుడు, ఏ.ఎల్.డి.ఎం, తదితరులు పాల్గొన్నారు.