
ఇస్మార్ట్ శంకర్ తో ప్రేక్షకుల్లో తనకంటు ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భామ నిధి అగర్వాల్ ఆ సినిమా ఘన విజయం తర్వాత కూడా నిధికి పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేదు.వెంట వెంటనే ఆఫర్స్ రావడానికి,నేనేం స్టార్ కిడ్ ని కాదు కదా,సినిమా ఆఫర్స్ రావడమే నాకు విజయంతో సమానం అని కూడా ఇటీవల చెప్పుకొచ్చింది.ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ ప్రభాస్ ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ అయిన ‘హరిహర వీరమల్లు’ది రాజాసాబ్ లో హీరోయిన్ గా చేస్తుంది.ఇక ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ‘పవన్ కళ్యాణ్’ గారు సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు.యాక్షన్ చెప్పగానే పూర్తిగా తన క్యారక్టర్ లో లీనమైపోయి,చుట్టు ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోరు.కేవలం చేసే సన్నివేశంపై మాత్రమే దృష్టి పెడతారు.ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి.వీరమల్లు కోసం గుర్రపు స్వారీతో పాటు క్లాసికల్ డాన్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.కథక్ కూడా నేర్చుకున్నాను.నేను ఇప్పటి దాకా చేసిన అన్ని క్యారెక్టర్స్ లలో వీరమల్లు లోనిదే ఉత్తమమైనదని చెప్పుకొచ్చింది.ఇక 2023 లో వచ్చిన ‘బ్రో’ తర్వాత పవన్ నుంచి ప్రేక్షకుల ముందుకి రాబోయే మూవీ ‘హరిహర వీరమల్లు’నే.మార్చి 29 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్నఈ మూవీ,ఏపి లోని పలు లొకేషన్స్లలో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు ప్రచార చిత్రాలు,పవన్ పాడిన సాంగ్ అభిమానులని ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఎ ఏం రత్నం నిర్మాత కాగా,జ్యోతికృష్ణ దర్శకుడు.