ముఖ్య అతిధిగా నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., వారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నగర ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందికి ఆర్ముడ్ రిజర్వ్ మైదానంలో డీ మొబలైజేషన్ సెర్మోనియల్ పెరేడ్ నిర్వహించడం జరిగినది.ఈ డీ మొబలైజేషన్ సెర్మోనియల్ పెరేడ్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన నగర పోలీసు కమిషనర్ గారు మొదటగా సిబ్బంది యొక్క సెర్మోనియల్ పెరేడ్ ను పరిశీలించారు, అనంతరం మాట్లాడుతూ ముందుగా అధికారులకు, సిబ్బందికి ఈ యాన్యువల్ డీ ఆర్ముడ్ రిజర్వ్ సందర్భముగా నా శుభాకాంక్షలు , 2019 తరువాత ఈ సంవత్సరం 2025 లో మళ్ళీ ఈ మొబలైజేషన్ నిర్వహించడం జరిగింది, *డీ మొబలైజేషన్ ఆర్ముడ్ రిజర్వ్ ఫోర్స్ కు చాలా అవసరం, పోలీసు నిబంధనల ప్రకారం ప్రతీ జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ వారు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో 12 లేదా 13 పనిదినములు మోబలైజేషన్ ట్రైనింగ్ చేయవలెను , మన జిల్లాలో ఈ నెల 14 వ తేదీ నుండి ఈ రోజు వరకూ మొత్తం 13 దినాలు మొబలైజేషన్, రెండు రోజులు గ్రేహౌండ్స్ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగినది, ఫిజికల్ ట్రైనింగ్, యోగా, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది తమ దైనందిన విధులలో శిక్షణ ఇవ్వడం తో పాటుగా, పి.ఎస్.ఓ లకు, మోటార్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో పనిచేయు సిబ్బందికి ఆయా విభాగాల సంబంధిత శిక్షణ ఇవ్వడం జరిగినది, పోలీసు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది అని అందుకే చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలి,ఆర్ముడ్ రిజర్వ్ నందు ఒక్క నెగెటివ్ రిమార్క్ రాకుండా ఉద్యోగం చేయాలంటే , రెగ్యులర్ గా మీరు మోబలైజేషన్ లో పాల్గొని శిక్షణ పొందాలి, మనం నేర్చుకుంటాం మర్చిపోతాం మళ్ళీ నేర్చుకోవాలి.ఆయుధాలతో విధులు నిర్వహిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలి, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం, రెండవది ఆరోగ్యం మన దేశంలో పోలీసు అధికారులకు, సిబ్బందికి రెగ్యులర్ గా హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, మనం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం గుర్తుంచుకోవాలి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ చాలా జాగ్రత్తగా చేయాలి, మీకు యెటువంటి సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి , మేము ఖచ్చితముగా సాయం చేస్తాం, సెలవులు ఇవ్వక పోతే నాకు తెలియచేయండి, చెడు అలవాట్లకు, ఆన్లైన్ ఆఫ్ లైన్ బెట్టింగ్లకు దూరముగా ఉండండి, సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించండి, త్వరలో కరోనరీ సి.టి ఏంజియోగ్రామ్ అందరికీ చేయబోతున్నాం, మీకు హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ ఉన్నదీ లేనిదీ దాని ద్వారా తేలిసి పోతుంది, దాని ప్రకారం చికిత్స అందజేస్తాం, ఇంకా మీకు ఆర్ముడ్ రిజర్వ్ లో ఏ సదుపాయాలు కావాలో మీకు ఐడియా ఉంటే నాకు తెలియజేయండి , దేశంలో మన వైజాగ్ సిటి ఏ.ఆర్ ఉత్తమముగా ఉండాలంటే ఏం చేయాలో చెబితే ఖచ్చితముగా చేద్దాం, మీరందరూ హాయిగా ఆనందముగా ఉంటూ ఇలాగే నిజాయితీగా పనిచేస్తారని ఆశిస్తూ , మరో మారు మీకు ఏ సహాయం కావాలన్నా, సమస్య ఉన్నా నా నెంబరు 7995095799 కు కాల్ చేయమని తెలుపుతూ ముగించారు.