Thursday, March 13, 2025
spot_img
Homeక్రైమ్-న్యూస్ఏపీలో బర్డ్ ప్లూ

ఏపీలో బర్డ్ ప్లూ

అమరావతి,న్యూస్ వన్ ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ప్లూ టెర్రర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కోళ్లకు మాత్రమే ఈ ప్లూ సోకగా.. తాజాగా ఏలూరు జిల్లాలో మనిషికి కూడా సోకినట్లు జిల్లా వైద్యశాఖధికారిణి డాక్టర్‌ మాలిని నిర్ధారించారు. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్దారణ అయింది.. కోళ్ల ఫారం దగ్గర్లో ఉంటున్న ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సింటమ్స్ కనిపించగా.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు.. అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని.. జాగ్రత్తులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.కోళ్ల ఫారాళ్లో పనిచేసేవాళ్లకు, కోళ్లను పెంచేవాళ్లుకు బర్డ్‌ఫ్లూ సోకే చాన్సుంది. ఇక వైరస్ సోకని కోడి మాంసాన్ని, గుడ్లను బాగా ఉడికించి తినొచ్చు. కానీ.. వైరస్ సోకింది.. సోకనిది మనకు తెలియదు కదా.. అందుకే.. కొన్నిరోజుల పాటు చికెన్‌ను దూరంగా ఉంచడం మంచిది. ఏపీలో బర్డ్‌ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌ల్‌గా గుర్తించి..అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోళ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు. బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోయిన ప్రాంతాల్లో.. 10 కిలోమీటర్ల దూరం వరకు చికెన్ షాపులు ఉండొద్దని, చికెన్ గానీ, గుడ్లను కానీ తినొద్దని చాటింపు వేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన చోట ఫారాలను3 నెలల పాటూ సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కోళ్ల ట్రాన్స‌పోర్ట్ ఆపేందుకు పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. . ఏలూరు పశుసంవర్ధకశాఖ ఆఫీసులో 9966779943 నంబర్‌తో 24 గంటల కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడైనా కోళ్లు, పక్షులు చనిపోతే.. ఆ సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెట్టోద్దని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments