Thursday, March 13, 2025
spot_img
Homeక్రైమ్-న్యూస్ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య

ఒడియా రాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య

బెంగళూరు,న్యూస్ వన్ ప్రతినిధి :

జగ్గర్నాట్‌గా ప్రసిద్ధి చెందిన ఒడియా రాపర్ అభినవ్ సింగ్ తనువు చాలించాడు. వైవాహిక జీవితంలో తలెత్తిన విభేదాలు.. భార్య మోపిన తప్పుడు ఆరోపణలు కారణంగా తీవ్ర మనస్తాపం చెందడంతో అభినవ్ సింగ్ ప్రాణాలు తీసుకున్నాడు. బెంగళూరులోని కడుబీసనహళ్లిలో అపార్ట్‌మెంట్‌లో విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.భార్యతో తలెత్తిన గొడవల కారణంగా రాపర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా పోలీసులు వెల్లడించారు. భార్య తప్పుడు ఆరోపణలు చేయడంతోనే రాపర్ విషం సేవించినట్లుగా తెలుస్తుందన్నారు. పోస్ట్ మార్టం తర్వాత… మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అతని కుటుంబానికి అప్పగించారు. అభినవ్ సింగ్ బెంగళూరులో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.అభినవ్ సింగ్ ఆత్మహత్యకు కారణమైన భార్య, మరో 10 మంది పేర్లను ఫిర్యాదులో బాధితుడి తండ్రి చేర్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. భార్య, ఇతరులు మానసికంగా హింసించడం వల్లే అభినవ్ చనిపోయాడని తండ్రి ఆరోపించారు. ‘జగ్గర్నాట్’ అనే రంగస్థల నామంతో అభినవ్ సింగ్ ఒడియాలో సుపరిచితుడు. ఆయన పాడిన కటక్ ఆంథమ్ అనే పాట సూపర్ హిట్ అయింది. దీంతో అతడు మంచి పాపులర్ సంపాదించాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments