
(విజయనగరం జిల్లా, న్యూస్ వన్ ప్రతినిధి)
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో చీపురుపల్లి డివిజన్ సమావేశం జిల్లా అధ్యక్షులు జి.మహేంద్ర బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేయటం జరిగింది. ఈ యొక్క డివిజన్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పి.భానుమూర్తి పాల్గొన్నారు.ఈ సమావేశంలో డివిజన్ కమిటీ ఏర్పాటు చెస్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, వార్షిక ఇంక్రిమెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆప్కాస్ అనే సంస్థను తొలగిస్తున్నట్టు పత్రికల్లో రావడం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఆప్కాస్ అనే సంస్థ తొలగిస్తే అంతకంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీను,ఎల్ శ్రీనివాస్, ఎం లక్ష్మణ్,ఆర్ సూర్యనారాయణ ,కనకరాజు , అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.