
ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్ రామకోటేశ్వరరావు
భట్టిప్రోలు, న్యూస్ వన్ ప్రతినిధి;
బాపట్ల జిల్లా భట్టిప్రోలు టి.ఎం.రావు ఉన్నత పాఠశాలలో బుధవారం కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు 67 మందికి 6వేల విలువ గల పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ నండూరి కార్తీక్ అందించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్. రామకోటేశ్వరరావు, మాట్లాడుతూ కార్తీక్ ఫౌండేషన్ సేవా సంస్థ స్థాపించి ఎంతో మంది నిరుపేదలకు సహాయం, నిరాశ్రాయులకు, ఆనాధలకు అన్నదానాలు, చేస్తున్నటువంటి కార్తీక్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని అయన అన్నారు, మన టి ఎం రావు ఉన్నత పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించిన కార్తీక్ కు ధన్యవాదములు తెలిపారు. అనంతరం డాక్టర్ నండూరి కార్తీక్ మాట్లాడుతూ.. విద్యకు నేటి సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నదని అన్నారు. అటువంటి విద్య పట్ల ప్రతి ఒక్క విద్యార్థి కృషి పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లితండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్. ఆర్ కోటేశ్వరరావు, కారాస్పాండెంట్ పి. మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు సి.హెచ్. శ్రీనివాసరావు, మొహమ్మద్ అన్వర్ హాక్, కె.వి.ఎల్. పార్వతి, తదితరులు పాల్గొన్నారు.