
సురేష్ (విశాఖ దక్షిణం,న్యూస్ వన్ ప్రతినిధి)
జివిఎంసి జోన్ ఫోర్ జోనల్ కమిషనర్ ఎం మల్లయ్య నాయుడు 29వ వార్డులో గల దండు బజార్, మక్కా మసీదు రోడ్డు, ప్రహ్లాద కళ్యాణమండపం రోడ్డు, జగదాంబ జంక్షన్ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్యంగా కాలువలో పేరుకుపోయిన చెత్తలను ఎప్పటికప్పుడు తొలగించాలని మరియు ప్రజలకు కాలువలలో ఎటువంటి చెత్తలను వేయకూడదని అవగాహన కల్పించమని తెలియజేశారు. మరియు రోడ్లపై పేరుకుపోయిన చెత్తలను ఎప్పటికప్పుడు తొలగించక పోతే సంబంధిత శానిటేషన్ సెక్రటరీలపై సానిటరీ సెక్రటరీలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మరియు వ్యాపారస్తులు అందరూ చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్కు ఆదేశించడం జరిగింది.ఈ పర్యటనలో సానిటరీ ఇన్స్పెక్టర్ అప్పారావు, సానిటేషన్ సెక్రటరీలు,మేస్త్రీలు పాల్గొన్నారు.