
జన సైనికులకు బండారు శ్రీనివాస్ పిలుపు
(గంటా మధు : ,న్యూస్ వన్ ప్రతినిధి)
ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించుకోవడం ద్వారా యువతకు భరోసా ఏర్పడుతుందని కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఆలమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మండల స్థాయి జనసేన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రజల ఆదరాభిమానాలను విశేషంగా పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను, యువత ఆశలను శాసనమండలిలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం వినిపిస్తారని బండారు శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కూటమి నాయకులు ఏ విధమైన భేదాభిప్రాయాలు ప్రదర్శించకుండా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామంలోనూ ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని, వారితో మాట్లాడి, కూటమి అభ్యర్థికి ఓట్లు పడేలాగా చూడాలన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. నేడు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పనితీరుకి మంచి ప్రతిస్పందన వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగుతుందని ఇదే ఆయన పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా జనసేనదే అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూరపరెడ్డి సత్య, సలాది జయప్రకాష్ నారాయణ, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, నల్లా వెంకన్న, తోట వెంకటేశ్వరరావు, గారపాటి శ్రీనివాస్ చౌదరి, గారపాటి త్రిమూర్తులు, కొత్తపల్లి నగేష్, పడాల అమ్మిరాజు,గుత్తుల నాగేశ్వరరావు, సిరిగినేడి పట్టాభి, చల్లా బాబి, చల్లా వెంకటేశ్వరరావు, శీలం వెంకటరమణ, దేశాబత్తుల సత్యనారాయణ, దాసరి వీర పండు, మండల నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.