
ప్రసాద్ (విశాఖ పశ్చిమం , న్యూస్ వన్ ప్రతినిధి)
బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ న్యూఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.సావిత్రిబాయి పూలెేకు భారతరత్న ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు,అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని కోరారు.దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు,ప్రస్తుత సమస్యలు చర్చించారు.బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.