
ఎస్టీ కమీషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు
విజయనగరం సిటీ ఫిబ్రవరి( 12) న్యూస్ వన్ ప్రతినిధి :
విజయనగరం జిల్లా లోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి వి జి శంకరరావు కు విజ్ఞప్తి చేశారు. విజయనగరం లోని కమిషన్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ డివిజి శంకరరావు ను శ్రీనివాసరావు బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విజయనగరం పట్టణంలోని పద్మావతి నగర్ లోని బాలుర వసతి గృహం, మహిళా ప్రాంగణంలోని వసతి గృహం తో పాటు రాజాం లోని బాలికల కళాశాల వసతి గృహంలో మరమ్మతులు చేపట్టాల్సి వుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కమీషన్ చైర్మన్ డాక్టర్ డి వి జి శంకరరావు స్పందిస్తూ కమిషన్ తరపున అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు అత్యంత ఆవశ్యకమన్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్ల విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తవనీ, విద్యపై కూడా పూర్తి స్థాయి లో దృష్టి సారించే అవకాశం వుంటుందన్నారు.