
జాతరలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, పురందేశ్వరి..
రామారావు (న్యూస్ వన్ ప్రతినిధి, రణస్థలం)
మహాలక్ష్మమ్మ జాతర చివరి రోజున అంబరాన అంటింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, పురందేశ్వరి ,తో పాటు ఎమ్మెల్యే, నడుకుదుటి ఈశ్వరరావు దంపతులు అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అమ్మవారి పూజకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అమ్మవారి దీవెనలు రాష్ట్ర ప్రజలు అందరి పైన ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. పెద్ద ఎత్తున భక్తులు మహాలక్ష్మి జాతరకు వచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి జాతరకు వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించు,కోవడం చాలా ఆనందంగా ఉందని, అందరము సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు భక్తులు ఆనందంతో పరవశించారు.