కంచరపాలెం,న్యూస్ వన్ ప్రతినిధి :
విశాఖ పశ్చిమ నియోజకవర్గం స్థానిక కంచరపాలెం పరిధి గొల్ల కంచరపాలెం విగ్నేశ్వర మహాలక్ష్మి శ్రీకృష్ణ మందిరం 10 వా వార్షికోత్సవ వేడుకలు ఆలయ అధ్యక్షుడు పల్లా ఎర్ని కుమార్ యాదవ్, కార్యదర్శి కొయ్య జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నంబర సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ యాదవ్, కోశాధికారి ఇసరపు చంద్రశేఖర్, మీడియా అడ్వైజర్ నక్కాన అజయ్ కుమార్ ,గౌరవ సలహాదారులు కిలాడిఅప్పలరాజు, సీరం రవి, మహిళా అధ్యక్షురాలు తోనంగి వెంకటరమణి, గౌరవ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి సాయి లత శ్రీకృష్ణ భగవాను ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.