
--- కూటమి సర్కార్ కు టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు వినతి
భీమిలీపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
మత్స్యకారుల సమస్యలను ప్రస్థావించడానికి, వారి గళం చట్టసభల్లో చర్చించుటకు కూటమి సర్కార్ మత్స్యకారులకు అవకాశం కల్పించాలని మత్స్యకారుల నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల జీవనవిధానం అంతంతమాత్రంగా ఉందని అన్నారు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు 9 జిల్లాలో 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారని అన్నారు. కానీ చట్ట సభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వలన వారి సమస్యలను ప్రస్థావించడానికి అవకాశం లేకుండా పోతుందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం, సరైన ప్రాతినిధ్యం ఇస్తారనే నమ్మకం ఉందని అన్నారు. దయచేసి రాష్ట్రంలో ఉండే ఏ జిల్లా నుండి అయినా మత్స్యకారులకు శాషణమండలిలో అవకాశం కల్పించినట్లయితే కూటమి సర్కార్ పై పూర్తి విశ్వాసం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలుగచేసుకొని మత్స్యకారులకు అవకాశం ఇస్తారని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు.