Thursday, March 13, 2025
spot_img
Homeసినిమా-వార్తలుచాల బిజీ ఆలోచిస్తా : రామ్ గోపాల్ వర్మ

చాల బిజీ ఆలోచిస్తా : రామ్ గోపాల్ వర్మ

పోలీసులు ఎంత పవర్ ఫుల్లో సినిమాల్లో చూపించిన రామ్ గోపాల్ వర్మ నిజ జీవితంలో మాత్రం వారిని చాలా తేలికగా తీసుకునేందుకు సిద్ధమవుతున్నాు. పదో తేదీన హాజరు కావాలని ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్ని లైట్ తీసుకుంటున్నారు. తాను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానని .. ఓ ఎనిమిది వారాల తర్వాత రమ్మంటే ఆలోచిస్తానని వాట్సాప్ లో సీఐడీ అధికారులకు సమాచారం పంపించారు.కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమా తీశారు. అందులో టీడీపీపై.. టీడీపీ అగ్రనేతలపై అభ్యంతరకరమైన భాషతో దృశ్యాలు చిత్రీకరించారు. సెన్సార్ అనుమతి రాకపోవడంతో ఆయన పేరు మార్చారు. అయితే యూట్యూబ్ లో మాత్రం ఇదే పేరుతో విడుదల చేశారు. దీనిపై కేసు నమోదు అయింది. సోషల్ మీడియా కేసుల్లో ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయనకు విచారణ ముగిసిన తర్వాత సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అప్పటికి తీసుకుని వెళ్లిన ఆయన తాను రానంటూ మారం చేస్తున్నారు.పోలీసుల విచారణకు సహకరించకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలిసేలా చేయడానికి సీఐడీ పోలీసులు సిద్ధంగానే ఉన్నారు. ఆర్జీవీ తాను రాను అని చెప్పడానికి సాక్షి కాదు.. నిందితుడు. ఇతరుల ప్రాథమిక హక్కుల్ని కాలసిన వ్యక్తి. అతనిపై అనేక కేసులు ఉన్నాయి. ప్రజాధనాన్ని రెండుకోట్ల వరకూ దోచుకున్న వైనంపై మరో కేసు రెడీగా ఉంది. ఇలాంటి సమయంలో విచారణకు సహకరించకుండా.. ఎనిమిది వారాలు.. పది వారాలు అని అడిగితే.. రాత్రికి రాత్రి అరెస్టు చేసి తీసుకు వచ్చినా ఆశ్చర్యం ఉండదు.ఆర్జీవీ సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలోనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు సమాధానం చెప్పలేదు. అందుకే ఆయన అరెస్టుకు దగ్గరపడుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments