
భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. NZతో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.