
నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి
విశాఖపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కు 90 వినతులు వచ్చాయని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. సోమవారం జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి అదనపు కమీషనరు డి.వి.రమణమూర్తి తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 90 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 03, 2వ జోన్ కు 14, 3వ జోన్ కు 21, 4వ జోన్ కు 6, 5వ జోన్ కు 11, 6వ జోనుకు 17, 8వ జోన్ కు 10, 9వ జోన్ కు 8, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 8 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 01, రెవెన్యూ విభాగమునకు 17, ప్రజారోగ్య విభాగమునకు 06, పట్టణ ప్రణాళిక విభాగమునకు 50, ఇంజినీరింగు విభాగమునకు 11, మొక్కల విభాగమునకు 02, యు.సి.డి విభాగానికి 03 కలిపి మొత్తంగా 90 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనరు మాట్లాడుతూ ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను ప్రతి రోజు పరిశీలిస్తూ, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ ఆర్.సోమన్నారాయణ, ప్రధాన ఇంజనీర్ పి.శివ ప్రసాద్ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎస్.వి. నరేష్ కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆదినారాయణ, డి.సి.ఆర్. ఎస్.శ్రీనివాస్, డిడిహెచ్ ఎం.దామోదర్ రావు, పర్యవేక్షక ఇంజనీర్లు గోవిందరావు, సత్యనారాయణ రాజు, రాజేంద్ర కృష్ణ, సి.పి. మీనా కుమారి, డి.సి.పి. హరిదాసు, కార్య నిర్వాహక ఇంజనీర్ చిరంజీవి, డి.పి.ఒ.లు ఎం.వి.డి. ఫణిరామ్, ఎల్.సురేష్, సి.వి.ఒ. డాక్టర్ ఎన్.కిశోర్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, బయాలజిస్ట్ సాంబమూర్తి, ఆర్.ఎఫ్.ఒ. హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.