
-బ్యాంకుల నుండి వరుస నోటీసులు
-కూటమి నేతలు చుట్టూ ప్రదక్షణలు
-ఇంటి తాళాలు ఇచ్చారు సరే ..
-మరి కనీస వసతులు కల్పించారా
- టిడ్కో ఇళ్లలో లబ్ధిదారుల అగచాట్లు
( న్యూస్ వన్ బ్యూరో )
సొంతింటి కల నెరవేరిందని కొండంత ఆశతో అక్కడికి వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతుంది..ఇల్లు వచ్చిందన్నా అన్న సంతోషం కంటే బ్యాంకుల నుండి వచ్చే నోటీసులకు భయపడాల్సిన పరిస్థితి టిడ్కో లబ్ధిదారులకు సంభవించింది.గత జగన్ ప్రభుత్వం హడావుడిగా గతేడాది ఏడాది జూన్ 16న సీఎం హోదాలో ఆర్భాటంగా ఇళ్లు ప్రారంభించిన జగన్ గృహప్రవేశాలు చేయించిన తర్వాత ఇళ్ల తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప కనీస వసతులు కల్పించలేదు. ఫలితంగా నేటికీ టిడ్కో లబ్ధిదారులు అష్టకష్టాలు,నరకయాతన పడుతున్నారు. పేదింటి కలల సౌధం కాస్తా సమస్యల ఆవాసంగా మారింది.జీ ప్లస్ త్రీ నమూనాలో 300, 365, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు..వసతుల కల్పనను మర్చిపోయారు. అంతే ఇక అప్పటి నుంచి ఇప్పటికీ సదుపాయాలు లేక లబ్ధిదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు.టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకుల నుంచి లబ్ధిదారులు పాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు అయ్యాయి . నాటి నుంచి రెండేళ్ల వరకు లబ్ధిదారులు వాయిదాలు చెల్లించనవసరం లేకుండా ఉంది .ఇప్పుడు ఆ గడువు కొంత మందికి పూర్తి కావడంతో బ్యాంకుల నుంచి నోటీసులు అందుకున్నారు. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా మారతారని బ్యాంకర్లు హెచ్చరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రుణాలు కట్టలేమని బ్యాంకు అధికారులకు చెప్తున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రుణాలిచ్చి, ఇళ్లు ఇవ్వకుండా బ్యాంకులు వేధింపులకు దిగడం సరికాదంటున్నారు.’బ్యాంక్ వాళ్లు ఇప్పటికే కొంతమందికి రెండుసార్లు నోటీసులు పంపించారు.సొంత ఇంటికి వెళ్లలేక … ఇటు అద్దెలు కడుతూ అవి ఎప్పుడు ఇస్తారో తెలియక లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకులు మాత్రం ఇళ్లకి ఈఎమ్ఐలు కట్టాలని హుక్కుమ్ జారీ చేస్తున్నదిని బ్యాంక్ వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కట్టే స్థోమతలేనప్పుడు సంతకాలు ఎందుకు పెట్టారని హెచ్చరిస్తున్నారు.టిడ్కో ఇళ్లు వస్తున్నాయిలే అని సంబరపడ్డ లబ్ధిదారులు అప్పులు తెచ్చిమరీ డిపాజిట్లు చెల్లించారు.ఇట్లు అప్పులకు వడ్డీలు కట్టలేక…సొంత ఇళ్లకు పోలేక..అద్దె కొంపలకు ఒక పక్క అద్దెలు కట్టుకుంటూ…బ్యాంకులకు రుణాలు చెల్లించలేక లబ్ధిదారులు నరకయాతనను బారాయిస్తున్నారు.ఈ నరకాన్ని తాము భరించాలమంటూ కొందరు మహిళలు కంట తడి పెట్టుకుంటున్న సన్నివేశాలు ఏపీ వ్యాప్తంగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు.ఇప్పటికీనా మహిళలు ఆవేదనను కూటమి ప్రభుత్వం అర్ధం చేసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని, తమ ఇళ్లకు వెళ్లేందుకు లబ్ధిదారులు మార్గం సుముఖం చేయాలని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.