
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బంగార్రాజు సినిమా తర్వాత నాగ చైతన్య చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అయినప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా చైకి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అక్కినేని అభిమానులకు ఫుల్ ఖుష్ ఇచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తండేల్ సినిమాలోని లవ్ సీన్స్ చాలా మందికి కన్నీళ్లు తెప్పించాయి. తాజాగా జబర్దస్త్ ఫైమా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసింది. ఫైమా షేర్ చేసిన వీడియోలో తండేల్ సినిమాకు వెళ్లడం, సినిమాలో లవ్ సీన్స్ ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్లు పెట్టుకోవడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తండేల్ సినిమా ఫైమాకు బాగా కనెక్ట్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సినిమా పై కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎంత కోపంగా ఉన్న ఆడది అయినా ఆ సీన్స్ చూస్తే ఏడావల్సిందే అని కొందరు. కొన్ని చోట్ల ఆపుకోలేము.. అలా ఉన్నాయి ఫిలింగ్స్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫైమానే కాదు చాలా మంది యూత్ కు ఈ సినిమా ఆ కనెక్ట్ అయ్యింది. చాలా మంది ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత అద్భుతంగా నటించారు నాగచైతన్య, సాయి పల్లవి.