
(విజయనగరం సిటీ , న్యూస్ వన్ ప్రతినిధి) :
విజయనగరం పట్టణంలో గల లంకా పట్నం కూడలి నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రెల్లి, దళిత, బీసీ సంఘాల నాయకులు తమిళనాడులోని శివగంగా జిల్లా మేలుపిడవురు గ్రామంలో దళిత వర్గానికి చెందిన అయ్యాస్వామి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడవ తరగతి చదువుతున్నాడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొని కళాశాలకు వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల యువకులకు నచ్చక అమనవీయంగా ప్రవర్తించి చేతులు నరికారు అంతే కాకుండా అయ్యాస్వామి ఇంటికి వెళ్లి సామాన్లు పడవేసి దూర్భాషలాడారు ప్రధాన నిందితులు వినోద్, ఆది ఈశ్వరన్, వల్లసూర్ ఈ దారుణానికి వడికట్టారని వాళ్ళను కఠినంగా శిక్షించాలని భారత దేశములోని అన్ని రాష్ట్రాలలో ఎస్. సి, ఎస్. టీ, బి. సి, మైనారిటీ, ముస్లిం, క్రైస్తవ సోదరులు, మహిళలు మీద హత్యలు, అత్యాచారాలు చేయటం దారుణం అని వాళ్ల పైన ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని జిల్లా దళిత చైతన్య సేవా సంఘం మరియు జిల్లా రెల్లికుల అధ్యక్షుడు సోము మురళీ మోహన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 23 వ సచివాలయం అడ్మిన్ గొండెల శ్యామ్ సుందర రావు,ప్రజా గ్రంధాలయ అధ్యక్షుడు షణ్ముకేశ్వర రావు, బి. సి కుల పట్టణ అధ్యక్షుడు దేవకీ నందన్ రావు, మాదిగ దండోరా సంతోష్ కుమార్, టౌన్ రెల్లికుల అధ్యక్షుడు పొడుగు ఈశ్వరరావు, గండ్రేటి అప్పారావు, సోము గురుమూర్తి, ఎర్రంశెట్టి దాసు, చన్న భైరగి తదితరులు పాల్గొన్నారు