
హర్షం వ్యక్తం చేసిన అభ్యుదయ రైతు ప్రసాదరావు
పాలకొండ,న్యూస్ వన్ ప్రతినిధి :
ఏళ్ల కాల పరిమితి దాటాక జిఓ 56 ప్రకారం ఇచ్చే ఫ్రీహాల్ట్ తదితర అంశాలపై తదుపరి ఏం చేయాలన్నదానిపై ఉప సంఘంతో అధ్యాయం చేయించాలన్న ప్రభుత్వం నిర్ణయం హర్షదాయకమని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తెలిపారు. ప్రీహాల్ట్ అయిన అసైన్డ్ భూములను నిషేదిక జాబితా 22(ఎ) నుంచి తొలగించడం రిజిసే్టషన్ల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పలు దపాలుగా ఈ నిషేదాన్ని కొనసాగిస్తాంది. నిషేదిత జాబితాలో చేర్చిన ప్రైవేటు భూములను స్వేచ్ఛ కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అభ్యంతరం లేని ప్రైవేటు భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రజలు రైతుల నుంచి వచ్చిన విన్నపాలు ఆధారంగాఒక్కో కేసును పరిశీలించి ప్రైవేటు భూములను నివాస స్థలాలను 22ఎ నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందన్నారు.