
పాయల్ రాజ్‌పుత్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో సెక్సీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పాయల్.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమె కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ‘ఆర్‌ఎక్స్100’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి మరోసారి ‘మంగళవారం’ చిత్రంతో పాయల్‌కి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమా ఆమెకు చాలా ప్లస్ అయింది. ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు కమిట్ అయింది. ఏడాదిన్నర దాటుతున్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. దీంతో ఆమె కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు అజయ్ భూపతి ‘మంగళవారం’ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు.
‘మంగళవారం’ చిత్రంలో పాయల్ పోషించిన శైలజ పాత్ర చనిపోతుంది. అయితే సినిమాను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే సీక్వెల్‌ని ప్రారంభించాలని అజయ్ ఆలోచన. అయితే సీక్వెల్‌లో శైలజ పాత్రను మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి తగ్గట్టు కథా గమనాన్ని ఎలా మారుస్తారు అనేది కీలకంగా మారింది. చనిపోయిన పాత్రను మళ్ళీ తెచ్చే పక్షంలో పాయల్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. తనకెంతో పేరు తెచ్చిన శైలజ పాత్రలో మరోసారి విజృంభించాలని పాయల్ ఎంతో ఆసక్తిగా సీక్వెల్ వైపు చూస్తోంది. కానీ, అందరూ అనుకుంటున్నట్టుగా పాయల్‌ని కాకుండా మరో హీరోయిన్‌ని తీసుకోవాలన్న ఆలోచనలో అజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. పాత కథను కంటిన్యూ చెయ్యకుండా ఓ కొత్త కథతో మంగళవారం సీక్వెల్ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కొత్త కథలో హీరోయిన్ కూడా కొత్తగా ఉంటే బాగుంటుందని అతను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారట అజయ్. అందుకే ఇప్పుడు పాయల్‌కి సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ‘మంగళవారం2’ చిత్రంలో కొత్త హీరోయిన్‌ని తీసుకునే అవకాశం ఉంది. అజయ్ రాసుకున్న కథలోని హీరోయిన్ పాయల్ కంటే హైట్ ఉండాలట. మరి అంత హైట్ ఉన్న హీరోయిన్ ఎవరు ఉన్నారు అనేది ప్రశ్న. వాస్తవానికి ‘మంగళవారం’ చిత్రంలో అజయ్ మొదట అనుకున్న హీరోయిన్ పాయల్ కాదు. అంతకుముందు ఆర్‌ఎక్స్100లో నటించి ఉండడం వల్ల ఆ సినిమాలో కూడా తనే నటిస్తానని అజయ్‌ని కన్విన్స్ చేయడంతో ఆ అవకాశం ఆమెకే ఇచ్చారు. అయితే సీక్వెల్‌కి మాత్రం ఆ అవకాశం లేదని తెలుస్తోంది. మరి దీనిపై పాయల్ ఎలా స్పందిస్తుందో చూడాలి