
వీర మహిళలకు ఘన సత్కారం
..
విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి :-
విజయనగరం /వుడా కాలనీ -పాల్ నగర్ 5 వ లైన్ లో గల కమ్యూనిటీ హాల్ మరియు పార్క్ ఆవరణలో 8 వ తేది సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో 16 మంది మహిళలకు ఘనంగా సత్కారం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షుడు కొండపల్లి అప్పలనాయుడు మహిళలు మరియు మహిళాదినోత్సవ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు అనంతరం ముట్నూరు సత్యనారాయణ అలాగే కార్యదర్శి పప్పు విశ్వనాధ్ మరియు కోశాధికారి దేముడు మాస్టారు మహిళా దినోత్సవం విశిష్టతను అభివర్ణించారు ఆ తరువాత 43 వ డివిజన్ కార్పొరేటర్ సత్యవతి మాట్లాడుతూ మన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం లో స్త్రీ అమ్ముడుపోయే వస్తువు కాదు అన్ని రంగాలలో మగవాళ్ళతో సమానంగా రాణించాలి అని ఎలా చెప్పారో ఆ విధంగా మన మహిళలు అన్ని రంగాలలో రాణించటం చాలా ఆనందించాలసిన విషయం అని తెలిపారు మరియు అసోసియేషన్ మన చేతుల్లోకి వచ్చాక అన్ని దేవుడు కార్యక్రమాలు చక్కగా చేసుకుంటా విజయనగరం పట్టణంలో పాల్ నగర్ వాసులుకు ఉన్న ఐక్యత ఎవరికీ లేదట్లుగా నిరూపిస్తూ ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా ఐక్యతగా ఉండి అందరికి ఆదర్శం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.సన్మానం పొందిన మహిళలలో కార్పొరేటర్ డి సత్యవతి, ఆర్ సత్యవతి, దేవి, లక్ష్మి,సావిత్రి, కళ్యాణి, నాగమణి, పి. పద్మ, ఎం. పద్మ, స్నేహ, నాగ మల్లిక, ప్రియ దర్శిని, విజయలక్ష్మి, తులసి,భవాని తదితరులు పాల్గొన్నారు అంతే కాకుండా ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జగన్నాధం, సత్యం, బంగారు రాజు, సత్యనారాయణ, కిరణ్, నరసింహమూర్తి, త్రినాథ రావు, యోగేశ్వర వర్మ తదితరులు ఉన్నారు.