రామరావు (శ్రీకాకుళం జిల్లా,న్యూస్ వన్ ప్రతినిధి)
నగరంలోని మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్ పరిశీలిస్తూ అక్కడ ఉన్న వర్తకుల,తో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లో నిత్యం రద్దీగా ఉంటుందని పారిశుధ్యం పూర్తిస్థాయిలో ఉండే విధంగా చర్య తీసుకుంటామని వారికి ఉండే సమస్యలపై పరిశీలించి సాధ్యమైనంత మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కెట్లో ఎమ్మెల్యే సందర్శన సమయంలో ఇద్దరు యువకులు అనుమాన,స్పదంగా, తిరగడం చూసి వారిని పట్టుకున్నారు. వారి నుండి ఆరా తీయగా గంజాయి సేవించి ఉన్నట్లుగా గుర్తించారని దీనిపై తక్షణమే చర్యలుకు పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మార్గ ద్రవ్యాల వైపు యువత చెడు మార్గానికి వెళ్ళకుండా ఎన్నో చర్యల చేపట్టినప్పటికీ గంజాయి వంటి మత్తు పదార్థాలను మార్కెట్లో సరఫరా కావడం ఆశ్చర్యంగా ఉందని ఇటువంటి ప్రమాదకరమైన మార్గ ద్రవ్యాలను నియంత్రించడానికి పోలీస్ వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పట్నంలోని యువత ఇటువంటి చెడు వ్యసనాలకు బానిస, అవుతున్నారని పోలీస్ వ్యవస్థ సంకల్పం పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని అయినప్పటికీ ఇంకా మార్పు రావట్లేదని తెలిపారు. ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తించాలని వెంటనే పోలీసులకు సమాచారము ఇవ్వాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా గంజాయి వ్యక్తులు పట్టుకోవడం అందరికీ ఆశ్చర్యం గురిచేసింది. ఇటువంటి చర్యలు ఏ ప్రజా నాయకుడు చేయలేరని ప్రజలు అంటున్నారు. ప్రజల మధ్య ఉన్న నాయకులకు ఇటువంటి సాధ్యమ,వుతాయని స్థానికులు అంటున్నారు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.