
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి :
మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఫలితాలు తరువాత టిడిపి మంత్రులు నేతలు ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెం నాయుడు చెపుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు ఉందా. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్య శాఖకు హెడ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్ కు పాల్పడి పట్టబద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకొండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరుపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఏ రోజు శ్రీనివాసుల నాయుడు మా అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూటమి తనకు మద్దతు ప్రకటించ లేదని స్పష్టం చేశారు. బాబాయి శ్రీనివాసుల నాయుడు అంటున్నారు. అబ్బాయి రఘు వర్మ అంటున్నారు. అచ్చం నాయుడు, రాంమోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు. కూటమి పాలనలో బ్లూ ప్లాగ్ బీచ్ అనే దాన్ని ఎత్తేసింది. ప్రభుత్వ చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ దూరంగా ఉంది.ఈ సమావేశం లో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ ముఖ్య నాయుకులు మొల్లి అప్పారావు , గండి రవి కుమార్ , జిల్లా అధికార ప్రతినిధి పళ్ళ దుర్గ , మంచాల మల్లేశ్వరి , అనుబంధం విభాగాల అధ్యక్షులు పెడాడ రమణి కుమారి, బోని శివ రామ కృష్ణ, మాజీ జోనల్ విభాగం ఇన్ ఛార్జ బి.పద్మవతి తదితరాలు పాల్గొన్నారు.