
మల్కాపురం,న్యూస్ వన్ ప్రతినిధి :
విశాఖపట్నం , పశ్చిమ నియోజక వర్గం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం దుర్గా నగర్ గ్రామం లో భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త కత్తితో దాడికి తెగపడ్డాడు . పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి గత సంవత్సరం నుంచి విభేదాలతో భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని, ఆదివారం రాత్రి ఆమె భర్త ఇంటికి వచ్చి వాగ్వాదానికి దిగాడని ఇద్దరి మధ్య జరిగిన వాదనలో కత్తితో దాడి చేశారని తెలిపారు. స్థానికులు సహాయంతో గాయాలైన సరస్వతి (34)కి సమీపనున్న సెంటెన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసి పోలీస్ వారికి సోమవారం సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మల్కాపురం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎస్ విద్యాసాగర్. అనంతరం ఆయన మాట్లాడుతూ భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి తప్ప వైవాహిక జీవితంలో తప్పొప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని మందలించారు. భార్యపై దాడి చేసిన భర్త మురళికి (38) సోమవారం సాయంత్రం రిమాండ్ కి పంపడం జరిగిందని ఆయన తెలిపారు.