
ఏయూ ని రాజకీయాలకు అడ్డాగా మార్చారని ఆరోపణలు
2019 నుంచి 2024 మధ్యలో ఏయూలో భారీ అవకతవకలు
రూ. 20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం పై ఆరోపణలు
ఇస్రో నుంచి వచ్చిన రూ. 25 లక్షల నిధులు గోల్ మాల్
60 రోజుల్లో విజిలెన్స్ విచారణ మంత్రి లోకేష్ వెల్లడి
( న్యూస్ వన్ బ్యూరో )
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. ఏయూ కి రెండు సార్లు వీసీగా వైసీపీ హయాంలో ప్రసాద్ రెడ్డి పనిచేశారు. ఆయన వీసీగా దూకుడుగానే వ్యవహరించారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా కూటమి పార్టీలు అన్నీ ఆందోళనలు చేశాయి. ఏయూ చుట్టూ హాట్ హాట్ పాలిటిక్స్ కూడా ఆ రోజులలో నడచింది.ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడం, కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగిపోయాయి. ఈ గ్యాప్ లో ప్రసాద్ రెడ్డి తన రాజీనామా చేశారు. ఇది జరిగిన ఇన్నాళ్ళ తరువాత ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేయడం విశేషం.ఈ సందర్భంగా పల్లా మాజీ వీసీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఏయూని ఆయన పొలిటికల్ ఆఫీసుగా మార్చేశారు అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏయూలో జరిగిన అనేక అవకతవకలు జరిగాయని పల్లా అన్నారు. వాటి మీద ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విజిలెన్స్ విచారణను జరిపించి బాధ్యులు మీద చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో ఏయూ మాజీ వీసీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అంటున్నారు.ఏయూలో గతంలో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని కూటమి పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి. వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు వర్శిటీ వేదికగా మారిందని కూడా విమర్శలు గుప్పించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తరువాత ఇపుడు ఏయూ మాజీ వీసీ మీద కూటమి ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భారీ అవకతవకలు జరిగాయని..అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో పాటు.. విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు అడ్డాగామార్చాని. రూ. 20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం చేయడం, ఇస్రో నుంచి వచ్చిన రూ. 25 లక్షల నిధులు గోల్ మాల్ చేయడంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలన్నారు. నాడు జగన్ విశాఖపట్నం వస్తే విద్యార్థుల తరగతులు ఆపి ఆయనకు స్వాగతం పలికేందుకు స్వయంగా వీసీనే విద్యార్థులను ప్రోత్సహించడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ప్రైవేట్ కాలేజీల నుంచి లంచాలు తీసుకుని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించడం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా నాటి అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. విశ్వవిద్యాలయాన్ని పాలకుల స్వార్థ ప్రయోజనాలకు వాడుకునేలా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్నారు. ఈ సందర్భంగా దీనికి స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. ఇప్పటికే ఇన్‌చార్జి వీసీపై కమిటీ వేసి నివేదిక అందించారని.. విజిలెన్స్ విచారణ పూర్తి అయిన వెంటనే దోషులను శిక్షిస్తామని.. అలాగే విశ్వవిద్యాలయ పురోభివృద్ధి కోసం విద్యా ప్రమాణాలను పెంచడం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఏయూ విద్యార్థులకు బోధనాసిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి... విద్యా నాణ్యతను పెంచి ఏయూ గౌరవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.. దీనికి సంతోసం వ్యక్తం చేసిన పల్లా శ్రీనివాసరావు ఇదే మా ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు.