కొత్తపేట,న్యూస్ వన్ ప్రతినిధి :
మాదిగ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కముజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఘన నివాళులర్పించడమైనది.ఈ సందర్భంగా జాతి కోసం వారి చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా మాదిగ వర్గీకరణ కోసం చేసిన పోరాటం మరువలేనిదని ఈరోజు వర్గీకరణ దిశగా అడుగులు ముందుకు పడటానికి యొక్క పోరాట ఫలితమేనని భావిస్తూ అమరవీరులకు నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తొత్తరమూడీ శ్రీను, ఉందుర్తి మోహన్ రావు, ఉండ్రాజ వరపు చిన్న, కముజు నాగు, సిర్రా నాగేశ్వరరావు, సిద్దుల కృపానందం,నవుండ్రి ధనరాజు ఉందుర్తి నాగేశ్వరరావు, తొత్తరమూడి వెర్రిబాబు కముజు ప్రవీణ్ కముజు ఆకాష్ తొత్తరమూడి గణేష్ ఉందుర్తి బన్నీ, ఉందుర్తి దిలీప్ వంగలపూడి పజ్వల్ మల్లిపూడి వెంకటరమణ తదితర మండల ఎమ్మార్పఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.