
(స్టేట్ ఇంచార్జీ ,న్యూస్ వన్ )
రోడ్డు ప్రమాద బాధితురాలికి స్వయంగా సపర్యలు చేసి హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. హోంమంత్రి అనిత గారు రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా.. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని చూసిన హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ ఆపి.. బాధితుల దగ్గరకు వెళ్లారు. గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేశారు. హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై హోంమంత్రి స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.