
విజయనగరం సిటీ న్యూస్ వన్ ప్రతినిధి :-
జిల్లాలోని మైనారిటీ వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకులు)లకు రుణాలను ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.జాన్ ఒక ప్రకటనలో కోరారు. ఎపి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ధరఖాస్తు దారుడి వయసు 21 నుంచి 55 లోపు ఉండాలని, ఆదాయం ఏడాదికి రూ.లక్షా,50వేల లోపు, పట్టణ ప్రాంత అభ్యర్ధులకు రూ.2లక్షల లోపు ఉండాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో దగ్గరలోని మీసేవ లేదా ఇంటర్‌నెట్ సెంటర్‌నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తుతోపాటు అవసరమైన దృవపత్రాలను కూడా జతచేయాల్సి ఉంటుందని సూచించారు. మండల కేంద్రాలు లేదా మున్సిపాల్టీల్లో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ నెంబర్లు 08922-230250, 9849901160, 9490066050, 9908667294కు సంప్రదించవచ్చునని సూచించారు.