
గంటా మధు (ఆలమూరు, న్యూస్ వన్ ప్రతినిధి)
మండల కేంద్రం ఆలమూరులో జరగనున్న రజకుల బల్లల పండుగ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు రజకుల ఉత్సవకమిటీ వారికి రూ.10 వేలు చందా ఇచ్చినారు.ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతు రజకులకు బల్లల పండుగ చాలా ఆనందకరమైనదని,వారి సేవలు ఎంతో విలువైనవి అన్నారు. అలాగే ఆలమూరు గ్రామ మాజీ సర్పంచ్ రజకుల కమిటీ పెద్దలు దువ్వాపు సుబ్బారావు,ఎరుకొండ ముసలయ్య మాట్లాడుతు అన్ని వేళల మాకు సహాయసహకారాలు అందిస్తున్న డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు కు రజకుల ఉత్సవ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో దువ్వాపు సుబ్బారావు,ఎరుకొండ ముసలయ్య,టేకి గంగరాజు,ఇల్లూరి శ్రీను,ఎరుకొండ సత్తిబాబు,ఎరుకొండ మణి,ఎరుకొండ ఉమామహేశ్వరరావు,నందమూరి ప్రసాద్,ఎరుకొండ సత్తిబాబు,తులసి నాగార్డున తదితరులు పాల్గొన్నారు.