
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఒకటి కాబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… విజయ్ దేవరకొండ – రష్మిక మొదటగా ‘గీత గోవిందం’లో కనిపించారు. ఈ సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.ఆ తర్వాత ఈ జంట ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా కనిపించి మెప్పించారు.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా జోడి నిలవడంతో విజయ్ దేవరకొండ , రష్మికలపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక ఒకరి తర్వాత మరొకరు కనిపించడం .. ఆ వెంటనే ఒకే మాల్దీవుల్లో రష్మిక ,విజయ్ వేర్వేరుగా దర్శనం ఇవ్వడంతో.. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే అభిప్రాయనికి వచ్చేశారు. ఎప్పటికప్పుడు తమ మధ్య ఎలాంటి బంధం లేదనివిజయ్ దేవరకొండ , రష్మిక క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినప్పటికి వీరిపై ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.ఆ మధ్య విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ వేర్వేరుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఫొటోలను తమ సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. విజయ్ దేవరకొండ ఒక ఫోటో దిగిన బ్యాక్‌గ్రౌండ్‌లోనే .. రష్మిక కూడా ఫొటో దిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు నిర్ధారించుకున్నారు.మరోసారి ఈ జంట ఒకే చోట దర్శనం ఇచ్చారు. రష్మిక, విజయ్ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ టీజర్ బుధవారం విడుదలైంది. ఈ టీజర్‌పై రష్మిక రియాక్ట్ అయింది. ”ఈ వ్యక్తి ప్రతిసారీ ఏదో ఒక అద్భుతమైన స్టోరీతో అలరించేందుకు సిద్ధమవుతుంటాడని” ఓ పోస్ట్‌ను విజయ్ దేవరకొండ గురించి షేర్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండపై ప్రేమను రష్మిక ఇలా మరోసారి బయటపెట్టిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.