Thursday, March 13, 2025
spot_img
Homeఅంతర్జాతీయ-వార్తలువాలంటీర్లను వదిలేసిన వైసీపీ?

వాలంటీర్లను వదిలేసిన వైసీపీ?

వాలంటీర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సంఘీభావం ఇవ్వని జగన్

పలు పార్టీలు సంఘీభావంతో ..ముక్కున వేలేసుకున్న వైసీపీ

వైసీపీ ప్రభుత్వ కాలంలో వాలంటీర్లకు బిరుదులు,సన్మానాలు

ఈ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా పనిచేసిన వాలంటీర్లు

పార్టీ సంక్షోభంలో ఉంటె ..వీళ్లు గోల ఏంటి పార్టీ నాయుకులు

మద్దతు ఇస్తే వాలంటీర్ల వలన పార్టీకి ఒరిగేది ఏమిలేదు ?

మమ్మలిని వాడుకొని పక్కకి నెట్టారంటున్న వాలంటీర్లు

నా సర్వసం వాళ్లే…..నేనే వాళ్ళు…వాళ్లే నేను….నాకు నాయుకులతో పనిలేదు…వాళ్ళు ఉంటె చాలు… ౩౦ ఏళ్ళు నాదే అధికారం అన్నాడు…ఇప్పుడు వాళ్ళకి కష్టం వస్తే గాలికి వదిలేసాడు…పార్టీ కోసం అష్ట కష్టాలు పడ్డ వాళ్ళను..పలకరించే నాధుడే లేడు..తల్లి,చెల్లి అందరిని వాడుకొని వదిలేసినట్టు ఇప్పుడు వాళ్ళని కూడా పక్కకి తోసేశారు..మాటా తప్పని…మడం తిప్పని జగన్…ప్రస్తుతం వాలంటీర్లను పక్కనబెట్టారా అంటే అవుననే చెప్పాలి…మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంటే శిబిరాలు వద్దకు కాదుకదా కనీసం…మద్దతు కూడా ప్రకటించలేదు.దింతో జగన్న మీద వాలంటీర్ల వ్యవస్థ గుర్రున ఉన్నటు తెలుస్తుంది.

( న్యూస్ వన్ బ్యూరో )

                       ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వాలంటీర్లు పనిచేశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి ప్రభుత్వ పథకాన్ని నేరుగా లబ్దిదారులకు చేర్చేందుకోసం వాలంటీర్ల సేవలను వాడుకుంది జగన్ ప్రభుత్వం అంటే కాదు వాలంటీర్లను తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లుగా భావించారు జగన్. వాలంటీర్లే తమ పార్టీని మళ్లీ గెలిపిస్తారని నమ్ముతూ వచ్చారు. అందుకే పార్టీ కేడర్ ను సైతం ఆయన పక్కన పెట్టి వాలంటీర్ల వ్యవస్తహు నెత్తి మీద పెట్టున్న జగన్...ప్రభత్వం మారడంతో..ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.ఏపీ వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల దాకా వాలంటీర్ల నియామకాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది. వారిని తమ వారుగా చెప్పుకుంది. వాలంటీర్లనే అన్నీ అని చాటింది. వైసీపీ ప్రభుత్వ కాలంలో వాలంటీర్ల సేవలను మెచ్చి సేవా రత్నతో పాటు ఇతర పురస్కారాలు నగదు బహుమతులు ఏటా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇస్తూ వచ్చారు.

                                                  వాలంటీర్ అంటే గర్వంగా చెప్పుకుంటామని వైసీపీ పెద్దలు తెగ డప్పులు కొట్టుకుంటారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పక్కన పెట్టేశారు. జగన్ సర్కార్ అయిదు వేలు ఇస్తే తాము పదివేలు ఇస్తామని చెప్పిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు వారిని అసలు పట్టించుకోవడం లేదు.తమ సర్వీసుని కంటిన్యూ చేయాలని హామీ ఇచ్చినట్లుగా పదివేల వేతనం చెల్లిస్తూ అపాయింట్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని వాలంటీర్ల ఆందోళన చేస్తున్నారు.మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే వాలంటీర్ల ఆందోళన కార్యక్రమాలు విశాఖలో మొదలయ్యాయి.వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరైన ఈ నిరసనలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తమ జీవనోపాధిని కొనసాగించాలని కోరారు. తమను తిరిగి విధులలోకి తీసుకోవడమే కాకుండా ఎన్నికల హామీగా ఉన్న కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.వాలంటీర్ల నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి నాయకులు హాజరయ్యారు. వామపక్ష అనుబంధ సంఘాలు అయిన కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యాయి..ఇంత వరుకు బనే ఉంది.కానీ అసలు ట్విట్ ఇక్కడే ఉంది.వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది, ప్రాణం పోసింది వైసీపీయే. 2019 ఆగస్టు వరకూ ఆ మాట ఏపీలోనే కాదు దేశంలోనూ ఎక్కడా వినిపించలేదు. ఇది ఒక విధంగా గొప్ప పాలనాపరమైన సంస్కరణగా చెప్పుకోవాలి. పౌర సేవలను ఇంటికే చేర్చే క్రమంలో కొంత గౌరవ వేతనం చెల్లిస్తూ ప్రతీ యాభై కుటుంబాలను యూనిట్ గా తీసుకుని వారి బాగోగులు చూసే బాధ్యత కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు మాత్రం  మాత్రం హాజరు కాలేదు.ఏపీలో ఎన్నో సమస్యలను గాలికి వదిలేసిన  వైసీపీ,యిపుడు ఈ వ్యవస్థను కూడా గాలికి వదిలేసినట్టు రాజకీయ విశ్లేషకులకు చేస్బుతున్నారు.వాలంటీర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సంఘీభావం తెలిపి వారికి మద్దతుగా నిలిస్తే బాగుంటుందని అనుకున్న వైసీపీ మాత్రం ఎన్నికల తరువాత వాలంటీర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు.

వారికి మద్దతు ఇస్తే వాలంటీర్ల వలన తమ పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమి లేద అని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకం అనేక చోట్లా వాలంటీర్ల పనిచేసారు అనడంలో ఈ మాత్రం సందేహం లేదు…ఒకొనొక సందర్భంలో ఓట్లు తో పాటు నోట్లు కూడా పంచారు అన్న ఆరోపణలు లేకపోలేదు…ఇంత చేసిన వాలంటీర్లను పట్టించుకోవడం లేదు.ప్రస్తుత రాజకీయ పరిస్టుల నేపథ్యంలో వైసీపీ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది.పార్టీని విడి ఒక్కకోరుగా బయటక వెళ్లిపోవడం,కొంత మంది నాయుకులు పలు కేసుల్లో ఇరుకోవడంతో పార్టీయే అష్ట కష్టాలు పడ్తుంటే…ఇప్పుడు వాలంటీర్లను పట్టించుకోడం అంటే పుండు మీద కారం జల్లినట్టే అని చెప్పాలి…ప్రస్తుతానికి ఐతే వాలంటీర్ల వ్యవస్థ అటకెక్కినట్టే అని చెప్పక తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments