విశాఖపట్నం,న్యూస్ వన్ ప్రతినిధి : మార్చి 10.
విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ నాయకత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం విజయవాడలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్,క్యాట్,జిల్లా కోర్టు ఆవరణలో గత 10నెలలుగా మూతపడ్డ క్యాంటీన్ తెరవాలని, కొత్త కోర్టు బిల్డింగుల్లో ఎయిర్ కండిషన్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ వినతి పత్రంలో కోరారు. చీఫ్ జస్టిస్ ఠాకూర్ ఆయా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ తెలిపారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని విజయవాడలో కలిసిన వారిలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవర సత్యనారాయణ,కార్యదర్శి నరేష్ కుమార్, ఉపాధ్యక్షులు ఇమంది శ్రీనివాసరావు, కోశాధికారి అశోక్ కుమార్ ఇతర ప్రతినిధులు ఉన్నారు.