పొన్నూరు, న్యూస్ వన్ ప్రతినిధి:
గుంటూరు జిల్లా ,పొన్నూరు పట్టణంలోని రష్మిక వైన్ షాపులో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో పట్టణ ఎస్ఐ శ్రీహరి నేతృత్వంలో గుంటూరు క్లూస్ టీం సిబ్బంది వైన్ షాపులో వేలిముద్రలు సేకరిస్తున్నారు. వేలిముద్రల ఆధారంగా దుండగులను త్వరలో పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. అలాగే చోరీ జరిగిన సూపర్ బజార్లో కూడా వేలిముద్రలు సేకరిస్తామని అన్నారు..