
అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదారావు
సూర్యారావు (పాలకొండ న్యూస్ వన్ ప్రతినిధి )
పడిపోతున్న రైతు ఆదాయాలు, పెరుగుతున్న గ్రామీణ రుణ భారం, వ్యవసాయానికి భారంగా మారుతున్న సమయంలో అన్నదాతల్లో ఆనందం నింపేందుకు మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు అన్నదాతల్లో ఆశలు రేపుతాయా అని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు అనుమానం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో హరితవిప్లం విజయవంతమైనా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరు లేక, పప్పు ధాన్యాల్లోను, వంట నూనెలల్లోను స్వయం సంవృద్ధి సాధించకపోవడంతో విదేశాల దిగుమతిపై ఆధారపడవలసి వచ్చిందన్నారు. యువతకు కొత్త నైపుణ్యలను నేర్పడం అధునాతన సేద్య సాంకేతికతను ప్రవేశపెట్టడం కొత్త పెట్టుబడులు ద్వారా పల్లెల్లోనే అవకాశాలు పెంచవచ్చని కేంద్రం గుర్తించింది. బిహార్‌లో పండే ముఖానా అటువంటి సూపర్ ఫుడ్‌గా గుర్తింపు తెచ్చుకొంది. కిసాన్ క్రిడెట్ కార్డుల ద్వారా రుణ పరిమితిని పెంచడం బడ్జెట్‌లో చెపుతున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పుడు 5 లక్షల రూపాయలు ద్వారా రుణం తీర్చుకోవచ్చు అంతకు ముందు అది మూడు లక్షలకే ఉండేది. పరిమితిని పెంచారు మంచిదే అమలులో లోపభూయిష్టంగా ఉంది. రెండు లక్షల రుణం వరకు ఎటువంటి హామీలు అవసరం లేదని చెపుతున్న బ్యాంకులు చొరవ చూపడం లేదన్నారు. గతంలో రైతుకు లక్షా అరవై వేల పాసుబుక్, 1`బి ద్వారానే బ్యాంకులు రుణమిచ్చేవి. రైతు అవసరానికి ఎక్కువకావాలంటే భూమి తనఖా పెట్టి(మార్టుగేజ్) ద్వారా 5 లక్షల రుణ సౌకర్యం కల్పించింది. కేంద్రం బ్యాంకులకు ఆదేశిలిస్తే గాని 3 లక్షల నుంచి 5 లక్షల రుణ సౌకర్యం కల్పించదు. వాతావరణ మార్పుల ద్వారా దేశంలో కూరగాయలు పండ్లు సాగు ప్రభావితమై వాటి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారు. ఈ లభ్యతను పెంచడానికి బడ్జెట్‌లో రూ.500 కోట్లు ప్రకటించారు. రైతుకు గిట్టుబాటు ధరలు వినియోగదారులకు పోషకాహారం అందడానికి ఈ నిధులు ఎంత వరకు తోడ్పడతాయో భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి పప్పులు వంట నూనెలను భారత్ దిగుబడి చేసుకోవలసి వస్తుంది. రసాయనిక ఎరువుల ధరలు పదేపదే పెరగడం రైతులకు శాపం అవుతుంది. చాలా ప్రాంతాలకు ఎరువులు సకాలంలో అందక పంటలు దెబ్బతింటున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు యూరియా లభ్యత పెద్ద సమస్యగా మారింది. దీని పరిష్కారానికి అస్సాంలో యూరియా కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ కర్మాగారం ఏడాదికి 12.7 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. వ్యవసాయం అంకుర సంస్థలకు రూ.10కోట్ల పెట్టుబడులు సమకూర్చడం మంచిదే. బడ్జెట్‌లో వ్యవసాయానికి మొత్తం కేటాయించిన నిధులు తక్కువేనన్న విమర్శలు వస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో ఏటా అయిదు లక్షల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే గాని వ్యవసాయ రంగం నిజమైన అభివృద్ధి సాధించలేదని నిపుణులు సూచిస్తున్నారు. మద్దతు ధరను చట్టభద్దత చేయాలని సంవత్సరం పాటు భారతీయ కిసాన్ సంఘాలు పోరాడిన మోదీ రైతులను క్షమించమనిచెప్పిన రైతులకు గిట్టుబటు ధర గుర్చి ఆర్థిక మంత్రి ప్రస్తావించకపోవడం విచారకరం.