
వార్డెన్ పై వేటు- హాస్టల్ నుండి బోర్డర్ల తొలగింపు
పాడేరు, ఫిబ్రవరి 17 (న్యూస్ వన్ ప్రతినిధి) :
స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదవ తరగతి విద్యార్థినిలు తమపై తప్పుడు ఫిర్యాదు చేశారు అని విద్యార్థినిని కొట్టినట్లు వివిధ మాధ్యమాలలో ప్రసారమైన వార్తకు జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ వెంటనే స్పందించి విచారణ జరపాలని డీఈవో పి బ్రహ్మాజీరావును ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈఓ విశ్వ ప్రసాద్ విచారణ జరిపి నివేదిక అందించారు. ఆ నివేదిక ఆధారంగా వసతి గృహం నిర్వాహకురాలైన శ్రావ్యను విధుల నుండి తొలగించారు. అదేవిధంగా ముగ్గురు బోర్డర్లను వసతి గృహం నుండి తొలగించి ఇళ్లకు పంపించవేశారు.