
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి పట్టణం, ఫిబ్రవరి 15 (న్యూస్ వన్ ప్రతినిధి)
హెల్మెట్ ధారణ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు. భద్రతా మాసోత్సవాలలో భాగంగా నెల రోజుల నుండీ రోడ్డు ప్రమాదాల కట్టడిపై ప్రజల్లో అవగాహన… ఉల్లంఘనలపై ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ,జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద మాట్లాడుతూ.. గత నెల 16 వ తేదీ నుండీ ఈనెల 15 వరకు జిల్లాలో పోలీసు, ఆర్టీఏ, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం, 2025 లో భాగంగా… రోడ్డు సేఫ్టీపై వివిధ రూపాలలో ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో సుమారు 94 కిలో మీటర్లు దాకా జాతీయ, 368 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఇదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 313 మంది దాకా చనిపోయారు. 734 మంది దాకా గాయాలపాలయ్యారు. ఇందులో 36 శాతం ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారే అధికంగా రోడ్డు ప్రమాదాలకు గురై అర్ధాంతరంగా చనిపోవడం, క్షతగాత్రులుగా మిగలడం జరిగింది.ఈనేపథ్యంలో నాణ్యమైన హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం.వెంకటనారాయణ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ఈ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి రక్షణ కవచంలా హెల్మెట్ ఉంటుందన్నారు.దీంతో పాటు ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని… ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సీ.ఎం.ఆర్ షాపింగ్ మాల్ మరియు సాగర్ సిమెంట్ వారి సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా 75 స్టాపర్ బోర్డులను జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు.అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులకు హోండా షోరూం కంపెనీ వారి సి.ఎస్.ఆర్ నిధుల నుండి 30 హెల్మెట్లు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా అందజేశారు.
ఎస్పీ నేతృత్వంలో భారీ బైకు ర్యాలీ :
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ నేతృత్వంలో అనకాపల్లి పట్టణంలో హెల్మెట్ ర్యాలీ జరిగింది. సి.ఐలు, ఎస్సైలు, ఆర్టిఏ అధికారులు మరియు సిబ్బంది హెల్మెట్లు ధరించి రింగ్ రోడ్డు జంక్షన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా డీఎస్పీ ఆఫీస్ కు చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తో పాటు అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఆర్టీవో జి.మనోహర్, ఎస్.బి డీఎస్పీ బి.అప్పారావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె. చైతన్య, ఇన్స్పెక్టర్లు ఎస్.లక్ష్మణమూర్తి, ఎం.వెంకట నారాయణ, టీ.వీ.విజయ్ కుమార్, జి.అశోక్ కుమార్, ఏ.స్వామనాయుడు, ఎస్సైలు శేఖరం, సత్యనారాయణ, ఈశ్వరరావు, సంతోష్ కుమార్, రవికుమార్, వెంకటేశ్వరరావు, అర్జునరావు ఇతర ఆర్టిఏ అధికారులు, అనకాపల్లి టౌన్ మరియు ట్రాఫిక్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.