
మార్చి 14 డేట్ ఇప్పుడు కాస్త క్రేజీ గా మారింది. హోలీ పండగ సెలవు కలిసి రావడమే కారణం. ఈ డేట్ కు రెండు యూత్ ఫుల్ సినిమాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఒకటి కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబా సినిమా. సరిగమ మ్యూజిక్ సంస్థ తొలిసారిగా తెలుగులో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల మార్చి 14 కు వెళ్తోంది.ఇదిలా వుంటే మరో డిఫరెంట్ యూత్ ఫుల్ సినిమా కోర్ట్. ఈ సినిమా టూ యంగ్ హీరో హీరోయిన్ల చుట్టూ తిరుగుతుంది. ప్రియదర్శి కీలకపాత్ర. ఈ సినిమాకు నిర్మాత హీరో నాని. అందువల్ల ఈ సినిమాకు సహజంగా క్రేజ్ వుంటుంది. సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప నాని కథ టేకప్ చేసి నిర్మించరు కదా. ఇప్పుడు ఈ సినిమాను కూడా మార్చి 14నే విడుదల చేయబోతున్నారు.నిజానికి మార్చి పరీక్షల సీజన్. పెద్దగా సినిమాలు రావు అనుకున్నాంతా. కానీ చూస్తుంటే మార్చిలో కూడా దాదాపు ఆరు సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికి మార్చిలో డేట్ లు వేసిన వాటిలో దిల్ రుబా, కోర్ట్, మాడ్ 2, రాబిన్ హుడ్ వున్నాయి. రెండు హోలీ కి, రెండు శివరాత్రికి. మరో సినిమాలు కూడా ఈ మధ్యలో డేట్ లు వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.