
అరకు నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్టీసి విజయనగరం రీజినల్ చైర్మన్ దొన్నుదొర.
సింహాచలం (ఆరుకులోయ, న్యూస్ వన్ ప్రతినిధి). గిరిజన ఏజెన్సీ ప్రత్యేక జీవో నెంబర్ పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.1/70 గిరిజన ఏజెన్సీ చట్టంలో ఎటువంటి మార్పులు లేదని. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం దొన్నదొర ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ1986 నవంబర్ 5న నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం జీఓ 275 5వ షెడ్యూల్లోని 5(1) కింద ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానిక ఆదివాసులకే 100 శాతం ఇవ్వాలని స్పష్టం చేసిందన్నారు. కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు తీర్పుకు అనుగుణంగా 2000 జనవరి 10న నాటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 275లో మార్పులు చేసి ఆదివాసులకు 100 శాతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని స్పష్టం చేసేలా జీఓ 3ను విడుదల చేసిందన్నారు. దీనిపై కూడా కొంతమంది సుప్రీం కోర్టుకు వెళ్లగా, 2002లో సుప్రీం కోర్టు జీఓ 3ను రద్దు చేసిందన్నారు.గిరిజన ప్రాంత యువతకు గుండెకాయలాంటి జీఓ నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రివ్యూ పిటిషన్ వేయాల్సిన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనీ. షెడ్యూల్డ్ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కడం జగన్కు, వైసీపీ వారికి ఇష్టం లేదన్నారు.గిరిజన ప్రాంత యువత ముక్తకంఠంగా కోరినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదనీ.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ దృష్టికి జీ.వో: 3 అంశం తీసుకురాగానే పునరుద్ధరించడానికి కృషి చేస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో వివిధ, పార్టీలు ప్రజల సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. 1/70 ఎటువంటి మార్పు రాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధికోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నా బూటకపు రాజకీయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.