
సింహాచలం (అరకు లోయ, న్యూస్ వన్ ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరణ చేయాలన్న వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో 48 గంటల మన్యం బంద్ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 6:00 నుండి అరకులోయ నియోజకవర్గం మండల కేంద్రంలో ప్రధాన రహదారి కూడలిలా వద్ద ఆదివాసి గిరిజన సంఘమాధ్యంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులతో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అరకులోయ మండల కేంద్రంలో మూతబడిన వాణిజ్యసముదాయాలు నిర్మాణస్యంగా మారిన ప్రధాన రహదారులు. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిషేధించబడ్డాయి. అయితే ఒకపక్క ఆదివాసి సంఘాలు. మరోపక్క రాజకీయ పార్టీలు బందుకు మద్దతు ప్రకటించింది. దిగివచ్చినా ప్రభుత్వం. స్పీకర్ స్థానం నుంచి అయ్యన్నపాత్రున్ని తక్షణమే తొలగించాలని. రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 1/70 చట్టం పై మాట్లాడిన మాటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తలదించాల్సిన దుస్థితి వచ్చిందని. ప్రభుత్వంలో కనీసం చట్టాలపై అవగాహనలేనీ వారు ఉన్నారని. చట్టాల పై అవగాహన లేకుండా అవహేళన, చులకనగా మాట్లాడరని ప్రజా సంఘాలు మండిపడ్డారు. స్పీకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే ఏజెన్సీలో బ్రతుకుతున్నారో వాళ్ళందర్నీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరచించాలి. ప్రభుత్వం ఆదివాసి పక్షపాతిగా, ఆదివాసి చట్టాలను అమలు చేసే పార్టీగా కొనసాగితే వారిని ప్రభుత్వంగా ఆదివాసులు విశ్వసిస్తారు. మళ్ళీ మీకే ఓటు వేయటానికి ముందుకొస్తారు. స్పీకర్ బేశరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పించాలని. ఇంతటితో ఉద్యమం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్దేవ్. అరకులోయ వైసిపి ఎమ్మెల్యే మత్యలింగం. ఎమ్మెల్సీ రవిబాబు. కాంగ్రెస్ నాయకురాలు శాంత కుమారి. సిపిఎం పార్టీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.