
తణుకు మండలం వేల్పూరులో జిల్లా కలెక్టర్ స్వయం పరిశీలన
వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై కలెక్టర్ ఆరా
శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాలు
ప్రజలు ఏటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు
10 కిలోమీటర్లు పరిధిలోపు కోడి మాంసం, గుడ్లు అమ్మకాలు నిషేధం
తణుకు: ఫిబ్రవరి 13 (న్యూస్ వన్ ప్రతినిధి):
కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.గురువారం తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కోళ్ల ఫారంలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోళ్ల షెడ్స్ లో ఆర్.ఆర్.టి బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులకు ఆరా తీశారు. ఎలా పూడ్చి పెడుతున్నారు, మీకు యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వేల్పూరు జి కృష్ణ నందం పౌల్ట్రీస్ లో వున్న ఐదు షెడ్లు లో వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత పక్రియ ఆర్ ఆర్ టి బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదిను కొనసాగుచున్నాయన్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకు పశు వైద్యులతో కూడిన 22 రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైరస్ సోకిన కోళ్లను చంపి తవ్విన గుంటలో ఒక లేయర్ కోళ్లు ఒక లేయర్ లైమ్ ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ పూర్తి శాస్త్రీయ పద్ధతిలో సోడియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ వేసి కోళ్లు పూడ్చివేత చేపట్టడం జరిగిందన్నారు. పౌల్ట్రీ లో సుమారు 20 వేల కోళ్లు వరకు ఉన్నాయన్నారు. కోళ్లు పూడ్చివేత ప్రక్రియ అనంతరం షెడ్లలో వున్న కోడి ఈకలను ఫైర్ గన్స్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుందని, అనంతరం షెడ్లను పూర్తిస్థాయిలో డిస్ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఆర్ టీం లకు యాంటీ వైరల్ డ్రగ్స్ ని కూడా అందజేయడం జరిగిందని, అలాగే సమీప పట్టణ,, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు డి ఎం అండ్ హెచ్ ఒ నుఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. కోడి మాంసం, గుడ్లు అసలు తినకూడదని చెప్తున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్రం, శాస్త్రవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించడం జరిగిందని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ మినహా మీగతా ప్రాంతాల్లో బాగా ఉడికించిన కోడి మాంసం, గ్రుడ్లను నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే మనుషులకు వైరస్ సోకిందన్న వార్తల్లో నిజం లేదని, ఇటువంటి లక్షణాలు ఎక్కడ నమోదు కాలేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలను చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ తనిఖీ సందర్భంలో ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.కె.మురళీకృష్ణ, జిల్లా ఇన్చార్జి వైద్యాఆరోగ్య శాఖ అధికారి డా.బి.భానూనాయక్, తహశీల్దారు డి.వి.యస్.యస్. అశోక్ వర్మ, యంపిడివో ఆర్.లోహిత్ జయ సాగర్, వివిధ మండలాలు పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్య నిపుణులు, టెక్నికల్ బృందం, వైద్య సిబ్బంది, తదితరులు వున్నారు.
📌📌📌