Thursday, March 13, 2025
spot_img
Homeజాతీయ-వార్తలుఎయిర్ పోర్ట్ లో ₹6 కోట్లు విలువచేసే డైమండ్ నెక్లెస్ స్వాధీనం

ఎయిర్ పోర్ట్ లో ₹6 కోట్లు విలువచేసే డైమండ్ నెక్లెస్ స్వాధీనం

న్యూ ఢిల్లీ (న్యూస్ వన్ ప్రతినిధి) :

అత్యంత ఖరీదైన నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని దిల్లీ విమానాశ్రయం అధికారులు అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువ చేసే నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కస్టమ్స్‌ విభాగం అధికారులు ఆదివారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఫిబ్రవరి 12న బ్యాంకాక్ నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా.. నెక్లెస్‌ను అక్రమంగా తరలిస్తున్న గుర్తించినట్లు తెలిపారు. వజ్రాలు పొదిగి ఉన్న 40 గ్రాముల ఈ నెక్లెస్‌ విలువ రూ.6.08 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ తెలిపారు. నిందితుడిని గుజరాత్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన అధికారులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments